'గాడిద దొంగతనం చేసిన చరిత్ర నీది': బల్మూరి వెంకట్‌పై బీఆర్ఎస్ నేతల తీవ్ర విమర్శలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాడిద దొంగతనం చేసి అరెస్ట్ అయిన చరిత్ర బల్మూరి వెంకట్ ది అని, ఆయనకు కేసీఆర్, కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి లేదని ఘాటుగా విమర్శించారు. కేవలం దాడులు చేయించడానికే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారా అంటూ నిలదీస్తూ, కాంగ్రెస్ నాయకుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.