కుటుంబ అనుబంధాల కథాంశంతో వస్తున్న డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్ టీజర్ విడుదల

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్ చిత్ర టీజర్ ను గురువారం ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారని దర్శకుడు శరత్ తెలిపారు. రజత్ రాఘవ్, కాజల్, హాసిని సుధీర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను నవంబర్ 27న విడుదల చేస్తున్నట్లు నిర్మాత డి.దీపక్ వెల్లడించారు. పిల్లలు, పేరెంట్స్ మధ్య ఉండే అరుదైన అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ కుటుంబ కథాంశంతో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ సభ్యులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.