ఎన్నికల బరిలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కదంతొక్కిన శ్రేణులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నరసన్నపేట

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధిలో పోటీ చేస్తున్న నలుగురు జెడ్పీటీసీ, డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాల అభ్యర్థుల గెలుపునకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసికట్టుగా శ్రమించాలని ఆయన బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.