మద్యం షాపుల రెన్యువల్ కు దరఖాస్తుల ఆహ్వానం
రిపోర్టర్: AHMED
స్థలం: పొదలకూరు
నెల్లూరు జిల్లా పొదలకూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పదిహేడు ఏ ఫోర్ మద్యం దుకాణాల లైసెన్సుల పునరుద్ధరణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీఐ వి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం ప్రస్తుత లైసెన్సుదారులతో సమావేశం నిర్వహించి రెన్యువల్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఏపీఎస్ బీసీఎల్ రిటైలర్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసి, నిర్ణీత ఫీజులు చెల్లించాలని సూచించారు. సెప్టెంబర్ ఇరవై ఒకటి లోగా రెన్యువల్ పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు.