డ్రాగన్ సినిమాకు సంగీత దర్శకుడిగా రవి బస్రూర్ అంటూ ప్రశాంత్ నీల్ ప్రకటన

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. దీంతో ఈ భారీ పాన్ ఇండియా సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి అని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపారు.