మార్కెట్లోకి కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆపిల్ ఎయిర్‌పాడ్స్ విడుదల
రిపోర్టర్: సతీష్
స్థలం: India
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ సరికొత్త ఏఐ ఫీచర్లతో ఎయిర్‌పాడ్స్‌ను మార్కెట్లోకి తెచ్చింది. బేసిక్ వేరియంట్ ధర రూ.14,900 కాగా, వైర్‌లెస్ ఛార్జింగ్ మోడల్ రూ.17,900గా ఉంది. సెప్టెంబర్ 18 నుంచి ఇవి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. మెరుగైన ఆడియో, 50 శాతం ఎక్కువ నాయిస్ క్యాన్సిలేషన్ సామర్థ్యంతో పాటు 22 గంటల బ్యాటరీ బ్యాకప్ అందిస్తున్నాయి.