వెస్టిండీస్ ఆటగాళ్లకు భారీ షాక్: ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై డీమెరిట్ పాయింట్లు
రిపోర్టర్: రాము
స్థలం: రాంచీ
వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి భారీ షాక్ ఇచ్చింది. రాంచీ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వెస్టిండీస్ స్టార్ ప్లేయర్లు రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌లపై ఐసీసీ చర్యలు తీసుకుందని అధికారులు తెలిపారు. మ్యాచ్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణంగా వీరిద్దరి ఖాతాలో చెరో డీమెరిట్ పాయింట్‌ను చేర్చినట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.