మురసు తుపాను హెచ్చరిక: మనమిత్ర వాట్సప్ ద్వారా సమస్యల ఫిర్యాదులకు అవకాశం

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

మురసు తుపాను కారణంగా తలెత్తే స్థానిక సమస్యలను మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అధికారులకు తెలపవచ్చని ఆర్టీజీఎస్ అధికారులు వెల్లడించారు. 95523 00009 నంబర్ కు హాయ్ అని మెసేజ్ పెట్టి మురసు సైక్లోన్ ఇష్యూస్ ఆప్షన్ను ఎంచుకోవాలని సూచించారు. ప్రాంతం వివరాలు, సమస్య నమోదుతో పాటు ఫొటోలు అప్లోడ్ చేయవచ్చని చెప్పారు. అత్యవసర సహాయం కోసం 112, 1070 నంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు.