కొండా సురేఖ తొలగింపు బాధాకరమే కానీ క్రమశిక్షణే ముఖ్యం: మహేష్ గౌడ్
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
తెలంగాణ రాజకీయంలో కలకలం రేపిన కొండా సురేఖ మంత్రివర్గ బర్తరఫ్ ఎపిసోడ్ పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం వ్యక్తిగతంగా ఎంతో బాధాకరమని, అయితే పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పార్టీ నియమావళికి అందరూ కట్టుబడి ఉండాలని, క్రమశిక్షణా చర్యల్లో ఎలాంటి వివక్ష ఉండదని ఆయన తేల్చిచెప్పారు.