వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత బలి అచ్చంపేటలో కుటుంబీకుల తీవ్ర ఆందోళన

రిపోర్టర్: dumarla bhaskar senier journalist స్థలం: అచ్చంపేట

అచ్చంపేట పట్టణంలోని భవాని ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత పద్మ మృతి చెందారు. డెలివరీ కోసం వచ్చిన ఆమెకు సిజేరియన్ చేయగా బీపీ పెరిగిందని జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.