వెండితెరపై రాధాకృష్ణుల ప్రేమగాథను తెరకెక్కించనున్న కరణ్ జోహార్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: India
భారతీయ పురాణాల్లోని అజరామర ప్రేమగాథ రాధాకృష్ణుల ప్రణయాన్ని భారీ విజువల్స్‌తో వెండితెరపై ఆవిష్కరించేందుకు బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ సిద్ధమయ్యారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సచిన్ రవి దర్శకత్వంలో ఈ ఆధ్యాత్మిక చిత్రం రూపొందనుంది. కృష్ణుడి జననం నుంచి రాధాకృష్ణుల విరహ వేదన వరకు సాగే ఈ కథాంశంపై ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలువడనుంది.