ఏపీలో ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ
రిపోర్టర్: రమేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో నిబంధనలకు అనుగుణంగా ఉన్న సుమారు 9 లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పునఃప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు వచ్చే వారంలో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. గతంలో నిలిపివేసిన నిషేధాన్ని ఎత్తివేయడంతో లక్షలాది మంది రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు దక్కనున్నాయి.