గుర్గావ్ లో కలకలం: పోలీసులపై కాల్పులు జరిపిన అక్రమ రవాణాదారులు

రిపోర్టర్: అశోక్ స్థలం: Gurgaon

గుర్గావ్ జిల్లాలోని బిలాస్పూర్ - తౌరు రోడ్డులో గోసంరక్షణ దళంపై అక్రమ పశువుల రవాణాదారులు కాల్పులు జరిపినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున సోనిపట్ నుండి రాజస్థాన్ కు ఎద్దులను తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో దుండగులు జరిపిన కాల్పుల్ లో ఎవరికీ గాయాలు కాలేదని, ఒక నిందితుడిని అరెస్ట్ చేసి రెండు ఎద్దులను రక్షించినట్లు ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.