అమృత్‌సర్‌లో ఏఎస్ఐని కాల్చి చంపిన దుండగులు
రిపోర్టర్: మహేష్
స్థలం: అమృత్‌సర్
పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని భక్తన్‌వాలా ధాన్యం మార్కెట్‌లో విధులు నిర్వహిస్తున్న హర్జిత్ సింగ్ అనే ఏఎస్ఐని బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై డీజీపీ గౌరవ్ యాదవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుని కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించారు.