డేటింగ్ యాప్ మోసం: 80 లక్షలు కోల్పోయిన వ్యక్తి
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మహిళ మోసంతో ఓ వ్యక్తి 82.5 లక్ష రూపాయలు కోల్పోయాడు. ఆన్‌లైన్ వ్యాపారం పేరుతో క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టించి నిందితులు మోసానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.