భారీ వర్షాలపై అధికారులతో సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులతో అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలు, ముందస్తు ప్రాణ నష్ట నివారణ మార్గాలపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, బాధితులకు నాణ్యమైన ఆహారం, తాగునీరు అందించాలని ఆదేశించారు. వర్షాలు తగ్గిన వెంటనే పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.