సోనమ్ వాంగ్చుక్ పాఠశాలకు షాక్: డెసర్ట్ ఫ్లవర్ స్కూల్ కార్యకలాపాలు నిలిపివేత
రిపోర్టర్: వెంకట్
స్థలం: Leh
వాతావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ కు చెందిన హిమాలయన్ ఇన్స్టిట్యూట్ పరిధిలోని పాఠశాల కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని లడఖ్ యంత్రాంగం నోటీసులు జారీ చేసిందని అధికారులు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండానే తరగతులు ప్రారంభించారని, భూ కేటాయింపుల కేసు హైకోర్టులో విచారణలో ఉన్నందున తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్కూల్ నిర్వహణను నిలిపివేయాలని లేహ్ తహసీల్దార్ స్పష్టం చేశారు.