పాకిస్థాన్ చీఫ్ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత మహిళల జట్టు నిరాకరణ

రిపోర్టర్: మహేష్ స్థలం: దుబాయ్

మహిళల ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను ఓడించి ఎనిమిదోసారి ఛాంపియన్‌గా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏసీసీ అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ చీఫ్ మొహ్సిన్ నవీ్ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు నిరాకరించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించినప్పటికీ, ప్రెజెంటేషన్ వేడుకలో ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశమైంది.