హైదరాబాద్ కు వందేభారత్ స్లీపర్ రైళ్లు: ప్రయాణికుల నుంచి డిమాండ్
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు అత్యాధునిక వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని ప్రయాణికుల నుంచి తీవ్ర డిమాండ్ వ్యక్తమవుతోందని రైల్వే అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్ లో ఈ స్లీపర్ సర్వీసులు అందుబాటులోకి వస్తున్న తరుణంలో, సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ అలాగే అయోధ్య మార్గాల్ లో కూడా వీటిని నడపాలని కోరుతున్నారు. సుదీర్ఘ ప్రయాణాలకు సీటర్ రైళ్లు అనుకూలంగా లేకపోవడంతో స్లీపర్ల కేటాయించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.