తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలు: సీపీఐ నేత బర్దాన్ను కలిసినట్లు శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: మహబూబ్ నగర్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు కోరుతూ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుల బృందంతో కలిసి ఢిల్లీలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్దాన్ను కలిసినట్లు మాజీ మంత్రి, మహబూబ్ నగర్ నేత వి. శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేసుకున్నారు. అక్టోబర్ 2011 నాటి ఆ చారిత్రక ఉద్యమ క్షణాలను సోషల్ మీడియా వేదికగా ఆయన పంచుకుంటూ, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అప్పట్లో సాగిన వివిధ రాజకీయ పార్టీల మద్దతు సేకరణ ప్రయత్నాలను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.