భక్తిశ్రద్ధలతో ఘనంగా సాగిన గణేష్ నిమజ్జనం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖానాపూర్

ఖానాపూర్ పట్టణంలోని ఎం.జే.పీ.లో వినాయక నిమజ్జన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తిశ్రద్ధలతో గణేష్ నామస్మరణ చేస్తూ ఉత్సాహంగా నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంతోష్, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.