సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలంటూ రాహుల్ గాంధీ డిమాండ్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: న్యూఢిల్లీ

ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సవరణపై రాజకీయ వివాదం చెలరేగింది. న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓట్ల చోరి, వ్యవస్థల ధ్వంసం జరుగుతోందని ఆరోపించారు. దేశంలో ఎన్నికలన్నీ రిగ్గింగ్ అయ్యాయని పేర్కొంటూ సీఈసీ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.