ముంబైలో కలకలం: రాజ్ థాకరేను కలిసిన అమీర్ ఖాన్ దంపతులు
రిపోర్టర్: గోపి
స్థలం: ముంబై
ముంబైలోని నివాసంలో ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరేను ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ తన భార్య గౌరీ స్ప్రాట్ తో కలిసి భేటీ అయినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఆయన మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ లీగల్ చిక్కుల్లో చిక్కుకున్న తరుణంలో జరిగిన ఈ రహస్య సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే వీరిద్దరి మధ్య జరిగిన చర్చల వివరాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.