ప్రాజెక్ట్ చీతా విజయవంతం: దేశంలో 52కి చేరిన చీతాల సంఖ్య
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో చేపట్టిన ప్రాజెక్ట్ చీతా నాలుగేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుందని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. ఈ కాలంలో దేశంలో చీతాల సంఖ్య 52కి చేరిందని, భారత గడ్డపై 32 పిల్లలు జన్మించాయని ఆయన పేర్కొన్నారు. కునోతో పాటు గాంధీ సాగర్ అభయారణ్యాలకు ఈ ప్రాజెక్ట్ విస్తరిస్తోందని, ఇది దేశ వన్యప్రాణి సంరక్షణ ప్రయాణంలో చారిత్రక మైలురాయిగా నిలిచిందని ఆయన వివరించారు.