డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలంటూ గవర్నర్‌ను కోరిన జగన్
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయవాడ
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్ బుధవారం విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. క్రీడా కోటా పేరుతో పరీక్షలు లేకుండానే అడ్డగోలుగా ఉద్యోగాలు కట్టబెట్టారని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు.