అలరిస్తున్న 'అనుమాన పక్షి' సినిమా ట్రైలర్

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

'డీజే టిల్లు' ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'అనుమాన పక్షి'. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అనుమానం అనే బలహీనత చుట్టూ నడిచే క్రైమ్ థ్రిల్లర్ మరియు డార్క్ కామెడీ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో హైలైట్‌గా నిలవనున్నాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.