కంఠారంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుక.. గురువులకు ఘన సన్మానం

రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు స్థలం: కొయ్యూరు

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కంఠారం పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు విచ్చేసి, విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఉపాధ్యాయులు నారాయణరావు, శరభ కుమార్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని గ్రామ పెద్దలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పి. లోవకుమారి, గాడి శ్రీమూర్తి, భాస్కర్రావు, పెట్ల అప్పలనాయుడు, బొడ్డు ఎరుకునాయుడు తదితరులు పాల్గొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.