సినిమా ప్రియులను అలరించేందుకు వస్తోన్న రాహుల్ విజయ్ ఏహెచ్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
నటుడు రాహుల్ విజయ్ మరియు అర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్ లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఏహెచ్ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లోని వేడుకలో విడుదల చేసినట్లు హీరో రాహుల్ విజయ్ వెల్లడించారు. ఈ చిత్రం నవంబర్ పన్నెండున థియేటర్లలో విడుదల కానుందని తెలిపారు. దర్శకుడు సాయి బలి పనితీరు అద్భుతంగా ఉందని, సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని ఆయన కొనియాడారు.