యువరాజ్ సింగ్ బయోపిక్ షూటింగ్ పై స్పష్టత: వచ్చే ఏడాది ప్రారంభం
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
తన జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ సినిమా షూటింగ్ ను వచ్చే ఏడాది ప్రారంభించే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వెల్లడించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, క్యాన్సర్ తో తన పోరాటం, ఆరోగ్యం ప్రాముఖ్యత మరియు రిటైర్మెంట్ తర్వాత అనుభవాలను పంచుకున్నారు. తన ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందని, మానసిక ఆరోగ్యం కూడా చాలా కీలకమని యువరాజ్ సింగ్ స్పష్టం చేశారు.