స్థానిక ఎన్నికలపై చిట్వేల్లో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చిట్వేల్ మండలం రైల్వేకోడూరులో వైఎస్సార్సీపీ మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జ్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల సన్నద్ధత, పార్టీ కార్యకలాపాలు, నాయకులు మరియు కార్యకర్తల సమన్వయంపై విస్తృతంగా చర్చించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.