ఫౌజీ టీజర్ వివాదం: చారిత్రక వక్రీకరణపై చంద్రకుమార్ బోస్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్ర టీజర్‌పై నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనవడు చంద్రకుమార్ బోస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చారిత్రక వాస్తవాలను వక్రీకరిస్తూ టీజర్లో కొన్ని సన్నివేశాలను చూపించారని, వెంటనే దానిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. 1942లో నేతాజీ, హిట్లర్ల మధ్య జరిగిన సమావేశాన్ని తప్పుగా చూపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చరిత్రకు కల్పన జోడించడం నేరమని ఎక్స్ వేదికగా ఆయన స్పష్టం చేశారు.