కృష్ణా ట్రైబ్యునల్ విధివిధానాలపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

రిపోర్టర్: సతీష్ స్థలం: దిల్లీ

కృష్ణా జలాల పంపిణీకి కేంద్రం జారీ చేసిన అదనపు విధివిధానాల నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 13కి వాయిదా వేసింది. ట్రైబ్యునల్ ముందు విచారణ తుది దశకు చేరినందున త్వరగా నిర్ణయం వెలువరించాలని ఏపీ తరఫు న్యాయవాది కోరగా, ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ప్రాజెక్ట్ల అప్పగింతకు సంబంధించిన ఇతర పిటిషన్లను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.