ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటు హెచ్చరిక: భారీ మూల్యం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఇరాన్

శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా దాడులతో ఇరాన్ అగ్రనాయకత్వం దెబ్బతిన్నదని, ఇప్పుడు చర్చలు జరపడానికి కూడా సరైన నాయకులు దొరకడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు అమెరికా హెచ్చరికలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తోసిపుచ్చారు. తమ దేశ విధానాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేస్తూ, మరోసారి ఘర్షణకు దిగినా వెనకడుగు వేసేది లేదని ఇరాన్ కరాఖండిగా తేల్చిచెప్పింది.