దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు బంద్ పిలుపునిచ్చిన బ్యాంక్ యూనియన్లు
రిపోర్టర్: సునీల్
స్థలం: భారతదేశం
దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఐదు రోజుల పనిదినాల డిమాండ్‌ను అమలు చేయాలని కోరుతూ ఈ సమ్మెకు సిద్ధమయ్యారు. వీకెండ్ సెలవులు తోడుకావడంతో ఖాతాదారులకు ఐదు రోజుల పాటు ఇబ్బందులు ఎదురుకావచ్చని హెచ్చరిస్తున్నారు.