గ్రామ సమస్యలపై కలెక్టర్‌కు వినతి

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: ముంచింగిపుట్టు

ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ మాజీ సర్పంచ్ కొర్రా త్రినాథ్ గ్రామస్థులతో కలిసి పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మొంజగూడలో శాశ్వత పాఠశాల, కనీస సౌకర్యాలు కల్పించాలని, తుమిడిపుట్టులో లోవోల్టేజీ సమస్యకు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.