రేవంత్‌రెడ్డికి విజన్ లేదంటూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్
రిపోర్టర్: వెంకట్
స్థలం: Hyderabad
తెలంగాణ ముఖ్యమంత్రిగా విజన్ లేని వ్యక్తిని రాహుల్ గాంధీ ఎన్నుకోవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి పరిపాలనా దక్షత లేదని, కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూరుస్తోందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.