ఇరాన్ పై విజయంతో భారీగా ఇంధన ధరలు తగ్గుతాయి: ట్రంప్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: World

ఇరాన్‌తో జరుగుతున్న పోరులో అమెరికా విజయం సాధించిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా చమురు మరియు ఇంధన ధరలు భారీగా పడిపోతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్‌పై విజయం అనంతరం పెట్రోల్ ధరలు గణనీయంగా తగ్గి గ్యాలన్ 2 డాలర్ల కంటే దిగువకు పడిపోతాయని ట్రూత్ సోషల్ వేదికగా ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వస్త్ర శక్తిగా మారకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ పునరుద్ఘాటించారు.