బీహార్‌లో విద్యార్థి జంటపై దాడి మరియు వేధింపుల ఘటనలో ముగ్గురి అరెస్ట్

రిపోర్టర్: నరేష్ స్థలం: Bihar

బీహార్‌లోని జమూయి జిల్లాలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి జంటను దుండగులు అడ్డుకుని బాలుడిపై దాడి చేయడంతో పాటు బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ అఘాయిత్యాన్ని తీవ్రంగా ఖండించగా, పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.