విజయవాడలో ఘనంగా స్వచ్ఛతాన్ మారథాన్: పది వేల మందితో ఉత్సాహంగా రన్
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయవాడ
శుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో స్వచ్ఛతాన్ మారథాన్ నిర్వహించినట్లు ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అమరావతి వరకు రన్ సాగింది. ఇరవై రెండు రాష్ట్రాల నుంచి పది వేల మంది రన్నర్లు పాల్గొన్నారు. ఇరవై ఒక కిలోమీటర్ల విభాగంలో సతీష్ కుమార్ మొదటి స్థానం సాధించారు. విజేతలకు పతకాలతో పాటు పది లక్షల రూపాయల నగదు బహుమతులు అందించారు.