బ్రిక్స్ దేశాలు వాణిజ్య అడ్డంకులను తొలగించాలి: పీయూష్ గోయల్
రిపోర్టర్: సతీష్
స్థలం: భారత్
బ్రిక్స్ దేశాలు పరస్పర వాణిజ్య అడ్డంకులను తొలగించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. స్థానిక కరెన్సీలలో వాణిజ్యం సాగించాలని, పేమెంట్ సిస్టమ్స్ అనుసంధానించాలని కోరారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌లో ఆయన మాట్లాడుతూ, సేవల మార్కెట్‌ను తెరిచి ఉంచాలని, నిపుణుల రాకపోకలను సులభతరం చేయాలని స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా పారదర్శక వాణిజ్య విధానాల ప్రాధాన్యతను నొక్కిచెప్పారు.