తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయి ఆదాయం

రిపోర్టర్: విజయ్ స్థలం: తిరుపతి

కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి హుండీ ఆదాయం సరికొత్త రికార్డు సృష్టించింది. భక్తుల రద్దీతో నిన్న ఒక్కరోజే ఏకంగా రూ. 6.93 కోట్ల రాబడి సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. గతంలో కేవలం మూడుసార్లు మాత్రమే ఆరు కోట్ల మార్కు దాటగా, పాత రికార్డులన్నింటినీ ఈ భారీ ఆదాయం తిరగరాసింది. భక్తులు భారీగా తరలివచ్చి కానుకలు సమర్పించారు.