ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వక విద్యార్థుల జీవితాలతో రేవంత్ చెలగాటం: హరీశ్ రావు

రిపోర్టర్: సునీల్ స్థలం: సిద్దిపేట

సిద్దిపేటలో హరీశ్ రావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థుల చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రూ.20 వేల కోట్లు ఖర్చు చేశామని, నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఆరోపించారు. పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో కలిపి, విద్యార్థులను కేవలం బ్లూ కాలర్ ఉద్యోగాలకే పరిమితం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.