ఎన్నికల సంఘం కార్యాలయం ముట్టడికి యత్నం: ఢిల్లీలో ఉద్రిక్తత
రిపోర్టర్: విజయ్
స్థలం: న్యూఢిల్లీ
ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనకారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ విషయాన్ని పీపుల్ ఎగైనెస్ట్ ఎస్ఐఆర్ సమన్వయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వైపు సాగుతున్న ఈ యాత్రను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీ, హర్యానా ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి జాతీయ జెండాలతో నిరసన తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా బంగ్లా సాహిబ్ గురుద్వారా పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించి ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.