అరకు ఘాట్ రోడ్డుపై ప్రమాదకర ప్రయాణం: నిలిచిపోయిన ఆర్టీసీ బస్సుల రాకపోకలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: Alluri Sitharama Raju

అరబ్ తుపాను ప్రభావంతో అరకు ఘాట్ రోడ్డు తీవ్రంగా దెబ్బతినడంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయని డిపో మేనేజర్ అప్పాజీ తెలిపారు. రోడ్డు పునరుద్ధరణ పనులు జరుగుతున్నప్పటికీ కొండల నుంచి వస్తున్న నీటితో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ఆర్టీసీకి రోజువారీగా ఆరు లక్షల రూపాయల ఆదాయం నష్టం వాటిల్లుతోందని ఉద్యోగ సంఘాల నాయకులు వాపోయారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు స్పష్టం చేశారు.