హైదరాబాద్ లో ఘనంగా సూర్య సీన్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా సినిమా సీన్ తెలుగు ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని జేఆర్ సీ కన్వెన్షన్ వేదికగా ఘనంగా జరగనుందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నజ్రియా హీరోయిన్ గా నటిస్తుండగా నస్లేన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.