ఎన్హెచ్ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి: కలెక్టరేట్ ఎదుట సీపీఐ హేమంతరావు డిమాండ్

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్లో ఎన్హెచ్ఎం ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోరుతూ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రజారోగ్య రంగంలో సేవలు అందిస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యులు కామ్రేడ్ భాగం హేమంతరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి వారి డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని నేతలు స్పష్టం చేశారు.