కొరటికల్ బీసీ కాలనీలో వైభవంగా గణపతి పూజలు
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కొరటికల్ గ్రామంలోని బీసీ కాలనీలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సర్పంచ్ కట్టేకోల సుశీల హనుమంత్ గౌడ్, దేవస్థాన కమిటీ చైర్మన్ మురారిసెట్టి సురేష్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని తాము స్వామివారిని ప్రార్థించినట్లు సర్పంచ్ తెలిపారు.