దారుణం: అనారోగ్యంతో ఉన్న కూతురుని భుజాన మోసిన తల్లి
రిపోర్టర్: విజయ్
స్థలం: విజయనగరం
అనారోగ్యంతో బాధపడుతున్న తన పన్నెండు ఏళ్ల కుమార్తెను కాపాడుకునేందుకు జన్ని సుకరమ్మ అనే తల్లి ఏడు కిలోమీటర్ల మేర భుజాలపై మోసుకుంటూ వెళ్లినట్లు స్థానిక వివరాలు వెల్లడించాయి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పల్లపు దుంగాడ గిరిజన గ్రామంలో రోడ్డు సదుపాయం లేకపోవడంతో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు నిర్మాణం నిలిచిపోవడంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.