మచిలీపట్నం మంగినపూడి సాగర తీరాన కన్నుల పండువగా గణపతి నిమజ్జనం
రిపోర్టర్: విజయ్
స్థలం: కృష్ణా
మచిలీపట్నం మంగినపూడి సాగర తీరాన సాగర తీర మహాగణపతి ఉత్సవాల తుది అంకం మహా నిమజ్జనం వేలాది మంది భక్తుల నడుమ అత్యంత కోలాహలంగా నిర్వహించినట్లు గనుల మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ వేడుకలో భాగంగా గణనాథునికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజల సుభిక్షం కోరుతూ పూజా కార్యక్రమాలు ఘనంగా చేపట్టినట్లు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.