ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో వెలిగిన ఆశీర్వాద దీపాలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వలిగొండ

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని వలిగొండ మండలం వర్కట్పల్లి గ్రామంలో భాజపా నేతలు ఆశీర్వాద దీపాలు వెలిగించి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోదీ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిరంతరం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన అంకితభావంతో చేస్తున్న కృషి ఇలాగే కొనసాగాలని ఆ పార్టీ నాయకులు ఈ సందర్భంగా కోరారు.